9 April, 2026 | 8:13 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

డిగ్రీలో 15నుంచి 20శాతం సిలబస్ మార్పు

30-05-2025 03:00 AM

150 నుంచి 142కు క్రెడిట్స్ కుదింపు

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): రాష్ర్టంలో డిగ్రీ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం 2025-26 నుంచి కొత్త సిలబస్‌ను అమలు చే యనున్నారు. 15 నుంచి 20 శాతం వరకు మాత్రమే కొత్త సిలబస్‌ను అమలుచేయనున్నారు. ఇప్పటివరకు డిగ్రీకోర్సుల్లో క్రెడిట్ బేస్డ్ ఛా యిస్ సిస్టం(సీబీసీఎస్)లో 150 క్రెడిట్స్‌తో కొనసాగుతుండగా.. ఇకపై దీనిని 142క్రెడిట్స్‌కు అధికారులు కు దించారు.

డిగ్రీకోర్సుల్లో లాంగ్వేజెస్‌కు ఉన్న 20 క్రెడిట్లను 12కు తగ్గిం చడంతోపాటు, ఎలెక్టివిస్(డీఎస్‌ఈ) లో ఇప్పటివరకు కొనసాగిన 30 క్రెడిట్స్ స్థానంలో 22 క్రెడిట్స్‌కి తగ్గిం చి, మొత్తంగా ఉన్న 150 క్రెడిట్స్‌ను 124కు కుదించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల నిర్ణయించింది.

అయితే లాంగ్వేజెస్‌కు క్రెడిట్స్‌ను తగ్గించడంపై భాషాభిమానుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో 142 క్రెడిట్లకు కుదించా రు. గురువారం డిగ్రీ కోర్సులనందించే ఏడు యూనివర్సిటీల వీసీల తో ఇదే అంశంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహిం చి నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.