8 April, 2026 | 2:46 AM

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

29-07-2024 02:55 AM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సంస్కృతి, సంప్రదాయాలకు బోనా లు ప్రతీక అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం రామ్‌నగర్‌లో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఇంట్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరు కున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మితో పాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.