8 April, 2026 | 12:51 AM

స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ స్థలం పరిశీలించిన సీఎం

29-07-2024 02:53 AM

మహేశ్వరం, జూలై 28: కందుకూరు మండలంలోని ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాంతంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి కేటాయించిన భూమిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఆగస్టు 1న యూనివర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించిన అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్ శశాంక, కందుకూర్ ఆర్డీవో సూరజ్‌కుమార్, మహేశ్వరం కాంగ్రెస్ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.