29 August, 2026 | 8:46 PM

Breaking News

సవరణ ఉంటే సరి చేసుకోండి   •   మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్   •   సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •  

ఎఫ్‌టీఎల్‌లో ఎస్‌వైఆర్ కన్వెన్షన్స్

31-08-2024 03:32 AM

మహేశ్వరం, ఆగస్టు 30: మీర్‌పేట్ పరిధిలో చెరువుల కబ్జాపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ నెల 28న చందన చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువులను సందర్శించారు. చెరువుల కబ్జా వివరాలు తెలుసుకున్నారు. వాటితోపాటూ పూర్తి నివేదికను వారం రోజుల్లో అందజేయాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా చందన చెరువు పక్కనే ఉన్న ఎస్‌వైఆర్ కన్వెన్షన్స్ సెంటర్‌ను రంగనాథ్ పరిశీలించారు. ఫంక్షన్‌హాల్ పార్కింగ్ స్థలంలో ఉన్న చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్ దిమ్మెను గుర్తించారు. కన్వెన్షన్స్‌కు సంబంధించిన పత్రాలు సమర్పించాలని సూచించారు. కన్వెన్షన్స్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించినట్లు తేలితే కూల్చివేయడం ఖాయమనే ప్రచారం జరుగుతున్నది.