calender_icon.png 3 February, 2026 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీకి గురైన 570 సెల్‌ఫోన్ల రికవరీ

31-08-2024 03:37:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): చోరీలకు గురైన 570 సెల్‌ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గత 25 రోజులుగా చోరీకి గురైన 570 సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. ఫోన్లను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో క్రైమ్స్ డీసీపీ కే నరసింహా శుక్రవారం బాధితులకు అందజేశారు. గత ఎనిమిది నెలల్లో సైబరాబాద్ పోలీసులు చోరీకి గురైన 2,696 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేస్తున్నట్లు డీసీపీ నరసింహా తెలిపారు.