ఇంటింటికీ ఓటరు ఫారాలు అందజేసిన తహసీల్దార్
బెజ్జూర్, జూన్ 24 (విజయక్రాంతి): భారత ప్రభుత్వంతో పాటు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ కార్యక్రమంలో భాగంగా భాగంగా మండలంలోని ఊట్సరంగపల్లి,బెజ్జూర్ గ్రామాలలో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాలను తహసిల్దార్ రామ్మోహన్ రావు అందజేశారు. బుధవారం గ్రామంలో పర్యటించిన బీఎల్‌ఓ సిబ్బంది అర్హులైన కొత్త ఓటర్లను గురించి ఫారం-6, మార్పుల చేర్పుల గురించి ఫారం-8లను అందజేశారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. మరణించినా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరు సహకరించి తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు తోడ్పడాలని సూచించారు. అదేవిధంగా బెజ్జూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ దుర్గం సరోజ ఓటర్ ఫారాలను అందజేశారు. ఈ ఓటర్ జాబితా కార్యక్రమం నెలరోజులపాటు కొనసాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వైకుంఠం,కారోబార్ వసంత్, దుర్గం తిరుపతి,స్థానిక బీఎల్‌ఓ సహాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.






