25 June, 2026 | 1:31 AM

గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం

25-06-2026 12:00 AM

సర్పంచ్ దీన రాజలింగం

జగదేవపూర్, జూన్ 24: జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో సర్పంచ్ దీన రాజలింగం ఆధ్వర్యంలో  గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బాలవికాస సంస్థ  గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, యువజనాభివృద్ధి, రైతు సంక్షేమం, విద్య, ఆరోగ్య రంగాలపై చర్చించి నూతనంగా 8 కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల సమన్వయ కమిటీకి  అధ్యక్షులుగా శ్రీనివాస్ , ఉపాధ్యక్షులుగా రాజలింగం  ,కార్యదర్శిగా  రమణ  ఎన్నికయ్యారు.

ఈ సందర్బంగా సర్పంచ్ దీన రాజలింగం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యం అని తెలిపారు.కార్యక్రమంలో బాలవికాస ప్రోగ్రాం మేనేజర్ మంజుల రెడ్డి,ఉప సర్పంచ్ నరేష్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు,బాలవికాస సంస్థ సిబ్బంది రమేష్,వెంకటేష్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.