25 February, 2026 | 11:24 PM

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన తహశీల్దార్

25-02-2026 09:27 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల పాఠశాలలో జరుగుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాని బుధవారం మఠంపల్లి మండల తాహశీల్దార్ లావురి మంగా పరిశీలించారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు మండల వ్యాప్తంగా 291 మంది విద్యార్థులు హాజరయ్యారు. 4 మంది గైర్హాజరయ్యారు. తాహశీల్థార్ కళాశాల,పోలీస్,వైద్య సిబ్బందికి  తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.