17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నాగిరెడ్డిపేట మండల ఏపీఎంగా వెంకటలక్ష్మి బాధ్యతల స్వీకరణ

25-02-2026 09:31 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండల సమాఖ్యలో కొత్త అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం)గా వెంకటలక్ష్మీ బాధ్యతలు స్వీకరించారు.ఆమె గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహించి, బదిలీపై నాగిరెడ్డిపేటకు వచ్చారు. ఇంతకాలం ఇక్కడ   ఎల్లారెడ్డి ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంకట లక్ష్మీ మాట్లాడుతూ... మహిళా సంఘాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. మండలంలో మహిళా సమాఖ్యల బలోపేతం, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వ పథకాల అమలువంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.