31 July, 2026 | 8:23 PM

Breaking News

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •  

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించిన డిసిపి రామ్ రెడ్డి

25-02-2026 06:27 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్‌ లో బుధవారం ప్రారంభమైన  ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి,  ఏసీపి కృష్ణలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు పరీక్షా కేంద్రంలోని భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తును పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

పరీక్షా కేంద్రం పరిసరాల్లో 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, అనవసర గుంపులు లేకుండా చూడాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. డిసిపి వెంట సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ లు ఉన్నారు.