15 June, 2026 | 9:51 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోండి

25-02-2026 12:28 AM

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి 

మేడ్చల్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులలో చికిత్స సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

వరికైనా సీఎంఆర్‌ఎఫ్ నుంచి సహాయం కావాలంటే తన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అల్వాల్ డివిజన్ ఎస్సీ బస్తికి చెందిన వెంకటేష్ అనారో గ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా రూ. 2.25 లక్షలు, ఎస్పి నగర్ లోని బాలాజీ ఫంక్షన్ హాల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ నదీమ్‌కు రూ.3.25 లక్షలు ఎల్‌ఓసిలు మం జూరయ్యాయి.

ఎల్‌ఓసిల మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస రెడ్డి, జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.