10 July, 2026 | 4:24 AM

బెంగాల్‌లో తాలిబాన్ తీర్పు

01-07-2024 01:04 AM

కోల్‌కతా, జూన్ 30: బెంగాల్‌లో తాలిబాన్ తరహా శిక్ష రాజకీయ దుమారం రేపుతున్నది. ఓ వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకొన్నదన్న ఆరోప ణలతో ఓ మహిళను నడిరోడ్డుపై వందలమంది నిలబడి చూస్తుండగా, అధికార టీఎంసీ నేత వెదురు కర్రలతో చితగ్గొట్టాడు. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా చోప్రాలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. మహిళలతోపాటు ఓ వ్యక్తిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చిన టీఎంసీ నేత తజేముల్.. మహిళను కనికరం లేకుండా కొట్టారు.

ఇన్‌సాఫ్ సభ పేరుతో శిక్షించినట్టు స్థానికులు తెలిపారు. ఇలాంటి శిక్షలు తాలిబాన్ పాలనలో సర్వసాధారణం. ఈ దాడిని ఖండించిన బీజేపీ, సీపీఎం నేతలు.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. చోప్రా టీఎంసీ ఎమ్మెల్యే హమీదుల్ రెహమాన్ మాత్రం ఈ ఘటనను సమర్థించారు.