టాల్ రేడియో, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యం
హైదరాబాద్ : భద్రత, రహదారి భద్రత, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం, సైబర్ భద్రతా అవగాహన , సామాజిక శ్రేయస్సు వంటి అంశాలపై ప్రజలలో అవగాహనను పెంచడానికి టాల్ రేడియో , (ఎస్.సి.ఎస్.సి)తో అధికారికంగా భాగస్వామ్యం చేసుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం, అవగాహన ఆధారిత కార్యక్రమాల ద్వారా సురక్షితమైన, మరింత పటిష్టమైన సమాజాలను నిర్మించడమే తమ లక్ష్యమని ఎస్.సి.ఎస్.సి తెలిపింది.ఎస్.సి.ఎస్.సి ఛైర్మన్ మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అయిన డాక్టర్ ఎం. రమేష్, ఎస్.సి.ఎస్.సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన నవేద్ ఆలం ఖాన్ నాయకత్వంలో, ఈ భాగస్వామ్యం మీడియా మరియు ప్రజా సేవ యొక్క శక్తిని ఏకం చేస్తుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, టాల్ రేడియో పాడ్‌కాస్ట్‌లు, కథనాలు, ఇంటర్వ్యూలు మరియు డిజిటల్ కంటెంట్ ద్వారా ఎస్.సి.ఎస్.సి యొక్క కార్యక్రమాలు, ప్రచారాలు, సమాజ కేంద్రీకృత ప్రయత్నాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంది.
ఈ భాగస్వామ్యం గురించి టాల్ రేడియో మేనేజింగ్ డైరెక్టర్ రమాదేవి మాట్లాడుతూ ఎస్.సి.ఎస్.సి తో తమ భాగస్వామ్యం, ప్రభావవంతమైన కథనాల ద్వారా భద్రత , సమాజ శ్రేయస్సుపై జరిగే ముఖ్యమైన సంభాషణలను ప్రజలకు మరింత చేరువ చేసే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ఎస్.సి.ఎస్.సి సీఈఓ నవేద్ ఆలం ఖాన్ మాట్లాడుతూ టాల్ రేడియోతో మా భాగస్వామ్యం, సురక్షితమైన, మరింత అవగాహన ఉన్న సమాజాన్ని నిర్మించాలనే తమ లక్ష్యాన్ని మరింత బలపరుస్తుందని చెప్పారు.సురక్షితమైన, మెరుగైన సమాచారంతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో పోలీసులు , సామాజిక సంస్థలు, మీడియా వేదికల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను ఎస్.సి.ఎస్.సి ఛైర్మన్ మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ గుర్తు చేశారు




