10 April, 2026 | 11:24 PM

తాడిపత్రిలో అల్ట్రాటెక్ ‘ప్రాజెక్ట్ ఉదయ్’

10-04-2026 09:38 PM

మార్చి 10, 2026: అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ , 800 మెట్రిక్ టన్నుల అరటి సూడోస్టెమ్ వ్యర్థాలను పల్లపు ప్రాంతాల నుంచి మళ్లించి, స్థిరమైన వ్యర్థ నిర్వహణతో పాటు గ్రామీణ జీవనోపాధిని పెంపొందించే వినూత్న నమూనాను అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో పల్లపు భారం, అలాగే అరటి వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయడం వంటి ద్వంద్వ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఈ యూనిట్ ఫిబ్రవరి 2025లో ‘ప్రాజెక్ట్ ఉదయ్’ను ప్రారంభించింది. ప్రారంభం నుంచే, ఈ ప్రాజెక్ట్ 500 మంది రైతులు, 100 మంది స్థానిక మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యవసాయ అవశేషాలను పర్యావరణహిత, విక్రయించదగిన ప్రోడక్టులుగా మార్చడంలో సహకరిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరిచింది.

తాడిపత్రి, భారతదేశ వ్యవసాయ ఎగుమతి విధానం కింద గుర్తింపు పొందిన అరటి క్లస్టర్‌గా, సంవత్సరానికి సుమారు 1,700 ఎకరాల్లో అరటి సాగు జరుగుతూ, దాదాపు 41,000 మెట్రిక్ టన్నుల సూడోస్టెమ్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఫైబర్‌తో సమృద్ధిగా, ధృడంగా, సహజంగా క్షీణించే పదార్థం చెందగల ఈ సూడోస్టెమ్ పదార్థం ఫైబర్ వెలికితీత, కంపోస్టింగ్, విలువ ఆధారిత ప్రోడక్టుల తయారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సామర్థ్యాన్ని వెలికితీయడానికే ‘ప్రాజెక్ట్ ఉదయ్’ రూపుదిద్దుకుంది.

ఈ చొరవ ఎండ్-టు-ఎండ్ జీరో-వేస్ట్ విలువ గొలుసుగా రూపుదిద్దుకుని, సూడోస్టెమ్ సేకరణ నుంచి ఫైబర్ వెలికితీత, నూలు తయారీ, నేత, హస్తకళల తయారీ వరకు విస్తరించింది. ఉత్పత్తి ప్రక్రియలను ఏర్పాటు చేయడం, నాణ్యత ప్రమాణాలను నిర్ణయించడం, పాల్గొనేవారికి శిక్షణ అందించడం కోసం, అరటి ఫైబర్ వెలికితీత మరియు ఉత్పత్తి అభివృద్ధిలో నైపుణ్యం కలిగిన సాంకేతిక సంస్థ ముసా ఫైబ్రాతో APCW భాగస్వామ్యం కుదుర్చుకుంది. మరొక కీలక భాగస్వామిగా ఉన్న స్థానిక మహిళా సహకార సంస్థ వికాస్ కోఆపరేటివ్ సొసైటీ, సమాజ సమీకరణతో పాటు జీవనోపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది.ప్రాజెక్ట్ ఉదయ్ తొలి దశలో, అరటి అవశేషాలను సేంద్రీయ ఎరువులు, ద్రవ ఎరువులుగా మార్పు చేసే విధానంపై సుమారు 500 మంది రైతులకు శిక్షణ అందించారు.

అదే సమయంలో, అదనపు విలువ సృష్టి కోసం మిగులు బయోమాస్‌ను పంచుకోవాలని వారిని ప్రోత్సహించారు. రెండవ దశ మహిళల ఆర్థిక సాధికారతపై దృష్టి సారించింది. 10 స్థానిక స్వయం సహాయక బృందాలకు చెందిన 100 మంది మహిళలకు సూడోస్టెమ్ కట్టింగ్, ఫైబర్ వెలికితీత, నేత, హస్తకళల తయారీలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మహిళలు పర్యావరణహిత హ్యాండ్బ్యాగ్లు, బుట్టలు, ల్యాప్టాప్ స్లీవ్లు, గోడ అలంకరణలు, కార్యాలయ ఉపకరణాలను తయారు చేస్తున్నారు. మిగిలిన బయోమాస్‌ను కంపోస్ట్, ద్రవ ఎరువులు, బయోగ్యాస్‌గా పునర్వినియోగం చేస్తూ, పూర్తి వినియోగాన్ని నిర్ధారిస్తున్నారు. తయారైన ఉత్పత్తులను వికాస్ ద్వారా, అలాగే ప్రదర్శనలు మరియు ప్రత్యక్ష అమ్మకాల ద్వారా విక్రయిస్తారు.