calender_icon.png 4 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన తాండూరు సబ్ రిజిస్ట్రార్

04-12-2025 12:11:55 AM

  1. రూ.16వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అధికారి
  2. డాక్యుమెంట్ రైటర్ కూడా అదుపులోకి..
  3. వెల్దుర్తిలోనూ రూ.20వేలు డిమాండ్ చేసిన సర్వేయర్లు

తాండూరు/వెల్దుర్తి, డిసెంబర్ 3, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ..16,000 లంచం తీసుకుంటుండగా ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ సాయికుమార్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ సాయికుమార్ అనే వ్యక్తినీ రెడ్ హ్యాం డెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అలాగే మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తానని చెప్పి రైతు వద్ద లంచం తీసుకుంటున్న సమయంలో మండల సర్వేయర్, ట్రైనీ సర్వేయర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం ఒక రైతు భూ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాల పరిశీలన, భూసర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తానని చెప్పి సర్వేయర్ శ్రీనివాస్, ట్రైనీ సర్వేయర్ శరత్ కుమార్ రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు.

బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పా టు చేసి అవినీతి అధికారులను పట్టుకున్నా రు. ఇద్దరు అధికారులను అరెస్టు చేసి ఏసీబీ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.