04-12-2025 12:11:30 AM
న్యాయమూర్తి రాధిక పిలుపు
నిర్మల్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ది వ్యాంగులు అంటే ప్రతి ఒక్కరు గౌరవించాలని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని న్యాయమూర్తి రాధిక, కలెక్టర్ అభిలాష అభినవ్, పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన దివ్యాంగుల దినోత్స వంలో పాల్గొన్నారు.
రాజ్యాంగం ప్రజల హక్కుల మాదిరిగానే దివ్యాంగులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు చట్టాలు కల్పించబడ్డాయని వాటికి భంగం కలిగినప్పుడు తమను సంప్రదించాలన్నారు దివ్యాంగుల సంక్షేమాని కి ప్రభుత్వం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆటల పోటీలో గెలుపొందిన దివ్యాంగులకు ప్రశంస పత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ డిఆర్‌డిఓ విజయలక్ష్మి క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రె డ్డి, అధికారి మురళి పాల్గొన్నారు.