calender_icon.png 21 July, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రీడమ్ ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించిన తనికెళ్ల భరణి

13-12-2024 02:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్.. పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తుందని, ఈ క్రమంలోనే వినియోగదారుల నమ్మకాన్ని, పారదర్శకతను చూరగొన్నదని జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

ఉత్పత్తి దశ నుంచే స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కోర్ట్ రూమ్ అడ్వర్టుజ్‌మెంట్ కోసం న్యాయమూర్తి పాత్రను సినీనటుడు తనికెళ్ల భరణి అంగీకరించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీని సందర్శించిన నటుడు తనికెళ్ల భరణి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ భద్రత, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు.