13-12-2024 01:58:40 AM
నిజామాబా ద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోదన్ కోర్టు ప్రాగంణాల్లో శనివారం జాతీయా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ చైర్‌పర్సన్ సునితా కుంచాల తెలిపారు. గురువారం ఆమె కోర్టులో వివరాలు వెల్లడించారు. రాజీపడాల్సిన క్రిమినల్ కేసులను రాచ పద్ధతిలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. చెక్‌బౌన్స్ కేసులు, బ్యాం క్ రుణాల కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. గృహ హిం స, మెయింటెనెన్స్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. తద్వారా సమయం, డబ్బు వృథా కాదని సూచించారు. కేసుల్లో ఒక్కసారి న్యాయమూర్తి అవా ర్డు జారీ చేస్తే, తర్వాత పైకోర్టుల్లో ఆప్పీల్‌కు వీలు ఉండదని స్పష్టం చేశారు.