14 March, 2026 | 6:29 AM

కుప్పకూలిన కేసీ-135 ట్యాంకర్

14-03-2026 01:11 AM
  1. ఉత్తర ఇరాక్‌లో అమెరికా రీప్యూయలింగ్ విమానానికి ప్రమాదం

ఫ్లుటైలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి 

రెండు సైనిక ట్యాంకర్ ఫ్లుట్లై ల్యాండ్ అవుతుండగా ఘటన 

తామే కూల్చేశామన్న ఇరాక్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ 

తమ దేశ సౌర్వభౌమాధికారం, ఎయిర్‌స్పేస్ రక్షణకేనని ప్రకటన 

బాగ్దాద్, మార్చి13: అమెరికా వాయుసేనకు చెందిన రీప్యూయలింగ్ విమానం కేసీ-135 ట్యాంకర్ ఉత్తర ఇరాక్‌లో శుక్రవారం కుప్పకూలింది. ఈ ఘటనలో విమా నంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి చెందినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. రెండు సైనిక ట్యాంకర్ ఫ్లుట్లై ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగినట్లు, రెండో విమానం సురక్షితంగా దిగినట్లు పేర్కొంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సందర్భంగా ఫ్రెండ్లీ ఎయిర్ స్పేస్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపింది. అసలు కారణంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని చెప్పింది.

మరోవైపు ఇరాక్‌కు చెందిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ తామే అమెరికా విమానాన్ని కూల్చేసినట్లు ప్రకటించిం ది. ఈ గ్రూప్ ఇరాన్‌కు అనుకూలంగా పనిచేస్తోంది. తమ దేశ సౌర్వభౌమాధికారం, ఎయిర్‌స్పేస్ రక్షణ కోసం ఈ పని చేసినట్టు తెలిపింది. ఆ సంస్థ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. శత్రువుల దాడి లేదా ఫ్రెండ్లీ ఫైర్లో ఇది కూలిపోలేదని వెల్లడించింది. 

ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు ఇరాన్ మీడియా చెబుతోంది. కేసీ-135 స్ట్రాటోట్యాంకర్‌లో కనీసం ముగ్గురు సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. వీరిలో పైలట్, కోపైలట్, ఆపరేటర్ ఉంటా రు. వీరితోపాటు నేవిగేటర్, మిషన్ ఆధారంగా అదనపు సిబ్బందిని తరలిస్తుంటారు. ఇరాన్ యుద్ధంలో తీవ్రమైన పనిఒత్తిడి ఉన్న కార్యక్రమం విమానాలకు గాల్లో ఇంధనం నింపడమే. వందల సంఖ్యలో అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు దాడులకు వెళుతుండటంతో ట్యాంకర్ విమానాల అవసరాలు గణనీయంగా పెరిగాయి.