ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల ఎటాక్
- ఒమన్‌లో డ్రోన్ కూలి ఇద్దరు, ఎర్బిల్‌లో ఫ్రెంచ్ సైనికుడి మృతి
గలిలీలో పడిన రాకెట్.. 80 మందికి పైగా గాయాలు
సౌదీలో 50 డ్రోన్ల కూల్చివేత
టెల్ అవీవ్/టర్కీ: ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో శుక్రవారం విరుచుకుపడింది. ఒమన్, ఎర్బిల్, గలిలీ, సౌదీ అరేబియాలో దాడిచేసింది. అయితే వీటిని ఇజ్రాయెల్ సైన్యాలు తిప్పికొట్టాయి. ఒమన్‌లో డ్రోన్ కూలి ఇద్దరు, ఎర్బిల్‌లో ఫ్రెంచ్ సైనికుడు మృతిచెందారు. గలిలీ రాకెట్ దాడిలో 80 మందికి పైగా గాయాలయ్యా యి. సౌదీలో 50 డ్రోన్లను కూల్చివేశారు. ఉత్తర ఇజ్రాయెల్‌లో పౌరులను లక్ష్యంగా హిజ్బుల్లా చేసుకుందని ఇజ్రాయెల్ ఆరోపించింది.
హిజ్బుల్లా తన దాడులను తీవ్రతరం చేస్తుండగా ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఇళ్లు, వీధులు, పాఠశాలలపై క్షిపణులు దాడి చేస్తున్నాయని ఇరాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ పాలన సూచనల మేరకు హిజ్బుల్లా ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఒక ప్రకటనలో ఆరోపించింది. ఇరాన్ క్షిపణని మధ్యధరా ప్రాంతంలో నాటో రక్షణ దళాలు అడ్డగించాయని టర్కీ తెలిపింది. ఇజ్రాయెల్‌లోని గలిలీలో రాకెట్ పడింది.
ఈ దాడిలో 80 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకు నేలోగా చాలామంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఓ డ్రోన్‌ను ఇజ్రాయెల్ సైన్యం తిప్పకొట్టడం వల్ల దుబాయ్ ఆర్థిక కేంద్రంలోని ఓ భవనం దెబ్బతింది. శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియ ల్ సెంటర్‌లోని ఒక భవనం ధ్వంసమైంది.
ఈ మేరకు దుబాయ్ మీడియా స్పష్టం చేసింది. కానీ డ్రోన్‌ను ఏది తిప్పికొట్టిందో గానీ, భవనం నష్టం గురించి గానీ పేర్కొనలేదు. ఐలాట్ సమీపంలో ఇరాన్ క్షిపణి దాడి చేసిందని, ఎవ్వరికీ గాయాలు కాలేదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. ఒమన్‌లోని సోహార్ ప్రావిన్స్‌లో డ్రోన్ కూలిపో యి, ఇద్దరు వ్యక్తులు మరణించారని ఒమన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అల్-అవాహి పారిశ్రామిక ప్రాంతంలో డ్రోన్ కూలిపోయిం దని, ఇద్దరు విదేశీయులు మరణించారని, అనేక మంది గాయపడ్డారని తెలుస్తోంది. అధికారులు ప్రావిన్స్‌లో మరో డ్రోనును కూడా అడ్డుకున్నారు.
ఇరాక్‌లోని ఎర్బిల్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడిలో ఫ్రెంచ్ సైనికుడు మృతి చెందాడు. ఈ మేరకు ఫ్రాన్స్ చీఫ్ వారెంట్ ఆఫీసర్ ఆర్నాడ్ ఫ్రియోన్ ధృవీకరించింది. ఈ దాడుల్లో మృతిచెందిన మొదటి ఫ్రెంచ్, యూరోపియన్ సైనికుడు ఇతడే. ఎర్బిల్ ప్రాంతంలోని ఫ్రెంచ్ సైనిక స్థావరంపై ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లు దాడిచేశాయి. తర్వాత ఫ్రెంచ్ సైన్యం సైనికుడు మృతిచెందినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
సౌదీ అరేబియా తన గగనతలంలోకి ప్రవేశించిన 38 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. సౌదీ అరేబియా తన వైమానిక రక్షణ దళాలు కొన్ని గంటల్లోనే 38 డ్రోన్లను అడ్డగించి నాశనం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెల్లవారుజామున వెల్లడించింది. సౌదీ అరేబియా రియాద్ సమీపంలో మరో ఎనిమిది డ్రోన్లను అడ్డుకుంది. సౌదీ అరేబియా వైమానిక రక్షణ వ్యవస్థలు అల్-ఖార్జ్ గవర్నరేట్, రియాద్‌కు పశ్చిమాన ఉన్న ప్రాంతాలతో సహా దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలలో మరో ఎనిమిది డ్రోన్లను అడ్డగించాయ ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అంతకుముందు, అనేక దాడుల ప్రయత్నాల్లో 14 డ్రోన్లు ఇప్పటికే ధ్వంసమయ్యాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో కాల్చివేసిన డ్రోన్ల సంఖ్య 22కి పెరిగింది. కొన్ని గంటల వ్యవధిలోనే సౌదీ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్ల సంఖ్య దాదాపు 50కి చేరుకుందని, వీటిని తిప్పికొట్టామని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ క్షిపణి దాడి తర్వాత జార్జిర్‌లో గాజు ముక్కలతో మొత్తం 58 మంది స్వల్పంగా గాయపడ్డారు. లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని జెరూసలేంకు ఉత్తరాన 100 కి.మీ దూరంలో ఉన్న జార్జిర్ నగరంపై జరిగిన క్షిపణి దాడిలో దాదాపు 30 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఇజ్రాయెల్‌కు చెందిన మాగెన్ డేవిడ్ అడోమ్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది.




