సుంకాలు విధిస్తూనే ఉంటా
- ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగిస్తా
- సుప్రీంకోర్టు ఆదేశాలు నా నిర్ణయాలను ఆపలేవు
- దుందుడుకుతనాన్ని తగ్గించుకోని ట్రంప్.. మరోసారి తెంపరి వ్యాఖ్యలు
వాషింగ్టన్, ఫిబ్రవరి ౨౩: సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రం ప్ తన వైఖరి మార్చుకోవడం లేదు. దుందుడుకుతనాన్ని ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు తాను పట్టించుకోనని, ప్రత్యామ్నాయ మార్గాలు, వాణి జ్యపరంగా తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుంకాలు విధిస్తానని ట్రంప్ ఉద్ఘాటించారు. ఇప్పటివరకు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని గతవారం అక్కడి సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పుపై ట్రంప్ తాజాగా విరుచుకుపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు అసమర్థ నీయమైందని, న్యాయస్థానం తన నిర్ణయాలను ఆపలేవని కొట్టిపడేశారు. మరోవైపు జనన హక్కు పౌరసత్వం విషయంలోనూ సుప్రీంకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీయులకు పౌరసత్వం కల్పించే నిబంధనలపై ఆంక్షలు విధించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, న్యాయస్థానం అడ్డుకోబోతున్నదని జోస్యం చెప్పారు.




