28 May, 2026 | 1:54 AM

టార్ఫలిన్లు అందించాలి: సీఎం

28-05-2026 12:04 AM

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో జిల్లాల్లోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్ఫలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కల్లా ల్లోని ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయడంతోపాటు కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. వాతావరణశాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అల ర్ట్ జారీ చేసిన నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ధాన్యపు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తి అయిన కేంద్రాల నుంచి టార్ఫా లిన్లను తరలించాలన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ధాన్యం కేంద్రాలే గాక, అన్నిచోట్లా, అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించా రు. సీఎం ఆదేశాల నేపథ్యంలో సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. 8 లక్షల మంది రైతులకు రూ. 10,002 కోట్లు విడుదల చేశామన్నారు.