13 August, 2026 | 9:43 PM

దొంగను పట్టుకున్న పోలీసులు

13-08-2026 08:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బర్కత్పుర, బాగులవాడ కాలనీలో దొంగతనానికి పాల్పడ్డ దొంగను టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి రెండు ఇండ్లలో చోరీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టార్ స్పోర్ట్స్ టీం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ముగ్గురు ఉండగా ఒకరు పోలీసులకు దొరికినట్టు తెలిపారు. ఉంగరం ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందామని దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిఎస్పి వెల్లడించారు.