సింగరేణి సత్తుపల్లి ఏరియాలో డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ పర్యటన
సత్తుపల్లి,(విజయ క్రాంతి): సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు సత్తుపల్లి ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. మొదటగా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ ఎస్. వెంకటచారి సమక్షంలో సత్తుపల్లి ఏరియాలోని అన్ని గనులు మరియు విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బొగ్గు నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకతపై సమీక్షిస్తూఏరియాకు నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడమే ప్రధాన అజెండాగా పనిచేయాలని,
ఉత్పత్తి మార్గంలో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆదేశించారు; అనంతరం కిష్టారం ఓపెన్‌కాస్ట్ మరియు జెవిఆర్ ఓపెన్‌కాస్ట్‌లలో రూ. 6 కోట్లకు పైగా విలువైన 6.4 క్యూబిక్ మీటర్ల బకెట్ సామర్థ్యం గల కొత్త కోమట్సు లోడర్లను ప్రారంభించడంతో పాటు జెవిఆర్ ఓపెన్‌కాస్ట్ గని వీక్షణ కేంద్రాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు; ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏరియా అధికారులు, వివిధ విభాగాల అధిపతులు, యూనియన్ ప్రతినిధులు మరియు కార్మికులు పాల్గొన్నారు.






