14 March, 2026 | 7:09 AM

దోచుకున్నట్టు అంగీకరించినట్టే

14-03-2026 12:00 AM

హెచ్‌సీఏ, మంత్రి వివేక్‌పై టీసీఏ తీవ్ర ఆరోపణలు 

రూ.64 కోట్లు క్రికెట్‌కు ఖర్చు చేస్తారా?

మంత్రి వివేక్ వ్యాఖ్యలపై గురువారెడ్డి మండిపాటు

హెచ్‌సీఏ నిధులు తీసుకోవడానికి వివేక్ ఎవరు?

హైదరాబాద్, మార్చి 13: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, మంత్రి జీ వివేక్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆ రోపణలు చేసింది. జిల్లాల్లో క్రి కెట్ మౌలిక సదుపాయాల కో సం రూ.64 కోట్లు ఖర్చు చేస్తానని మంత్రి చేసిన వ్యాఖ్యలు అక్ర మంగా మళ్లించిన క్రికెట్ నిధులను స్వీకరించినట్టు ప్రత్యక్ష అంగీకారమేనని టీసీఏ పేర్కొంది. శుక్రవారం టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రకటన భారత క్రికెట్ పరిపాలనలో జరిగిన అ తిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా బయటపడే అవకాశం ఉందన్నారు.

ఒక మంత్రి హెచ్‌సీఏ నుంచి వచ్చిన రూ.64 కోట్లు జిల్లాల క్రికెట్ అభివృద్ధికి ఖర్చు చేస్తానని చెప్పడం అంటే ఆ డబ్బు తీసుకున్నట్టు పరోక్షంగా అంగీకరించినట్టే కదా అని ప్రశ్నించారు. దీని ని తప్పు అంగీకారంగా పరిగణించకపోతే క్రీడా సంస్థలను నడిపించే చట్టాల ఉద్దేశం అర్థం లేకుండా పోతుందని అభిప్రాయపడ్డా రు. క్రికెట్ సంస్థకు చెందిన నిధులపై ఒక మంత్రికి  అధికారమేంటని ప్రశ్నించారు. ఆ డబ్బును వెంటనే హెచ్‌సీఏ ఖాతాకు తిరిగి జమ చేసి, బీసీసీఐ పర్యవేక్షణలో పారదర్శకంగా వినియోగించాలని టీసీఏ డిమాండ్ చేసింది.

విశాఖ ఇండస్ట్రీస్, హెచ్‌సీఏ మధ్య జరిగిన ఆర్బిట్రేషన్ కే సును ఉద్దేశపూర్వకంగా తప్పు గా నిర్వహించారని టీసీఏ ఆరోపించింది. దీని ఫలితంగా క్రికెట్ అభివృద్ధి కోసం ఉన్న సుమారు రూ.69 కో ట్ల నష్టం జరిగిందని పేర్కొంది. ఈ అవకతవకలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ లు కూడా నివేదికల్లో ప్రస్తావించినట్టు తెలిపింది. జూలై 2023, అక్టోబర్ 2023లో స మర్పించిన నివేదికల్లో సంస్కరణలు సూచించినప్పటికీ, హెచ్‌సీఏ వాటిని అమలు చేయ కుండా కోర్టులోనే సవాలు చేసిందని ఆరోపించింది. 2018లో బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి చేయాలని ఆదేశించినప్పటికీ, హెచ్‌సీఏ సంవత్సరాలపాటు వాటిని అమ లు చేయలేదని పేర్కొంది. హెచ్‌సీఏలో పరిపాలనను శుభ్రం చేయడానికి బీసీసీఐ ఒక ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని నియమించాలని టీసీఏ కోరింది.