ట్రైబల్ గేమ్స్‌కు తెలంగాణ ఆర్చరీ క్రీడాకారులు
14-03-2026 12:00 AM
హైదరాబాద్, మార్చి 13: జాతీయస్థాయి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 పోటీలకు రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారులు ఎంపికయ్యారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో బీ సంజన శ్రీ, పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో అశ్విత్ దొర కొమరం, ఏర్ప ఆనంద్, కయం లక్ష్మణ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరంతా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులే.
కొంత కాలంగా ఈ ముగ్గురూ ఆర్చరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఆ ప్రదర్శన లతోనే ఇప్పుడు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించి ఔరా అనిపించారు. ఈ సం దర్భంగా క్రీడాకారులకు, కోచ్‌లకు, వారికి సహకరించిన అందరికీ ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు సాదుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య కృతజ్ఞతలు తెలిపారు.




