2 September, 2026 | 12:38 AM

మహిళా క్రికెటర్లకు టీసీఏ ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్

02-09-2026 | 12:00am

రేపు టీకేఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహణ

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) మహిళా క్రికెటర్లకు అవకాశాలపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా మహిళా క్రికెటర్ల కోసం ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్(TCA Open Selection Trials) నిర్వహించబోతోంది. గురువారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు టీకేఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ సెలెక్షన్స్ జరగనున్నాయి. జూనియర్, సీనియర్ కేటగిరీలకు చెందిన ప్రతిభావంతమైన మహిళా క్రికెటర్లు ఈ సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు.

ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను టీసీఏ వివిధ జోనల్ జట్లకు ఎంపిక కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. ప్రస్తుత సీజన్ నుంచి బీసీసీఐ గుర్తింపుపొందిన టోర్నమెంట్లప్రొఫెషనల్, పోటీ గుర్తింపుపొందిన క్రికెట్‌లో రాణించాలనుకునే తెలంగాణలోని అన్ని మహిళా క్రికెటర్లకు ఇది ఒక గొప్ప అవకాశంమనీ టీసీఏ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతమైన మహిళా క్రికెటర్లు ఈసెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని టీసీఏ పిలుపునిచ్చింది.