calender_icon.png 12 July, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీసీఎస్ నికరలాభం 11,909 కోట్లు

11-10-2024 01:37:10 AM

షేరుకు రూ.10 డివిడెండు

ముంబై, అక్టోబర్ 10: దేశంలో అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ టీసీఎస్ ఆర్థిక ఫలితా లు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేక పో యాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 5 శాతం వృద్ధిచెంది రూ. 11,909 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో రూ.11,342 కోట్ల నికరలాభాన్ని నమోదుచేసింది.

తాజా త్రైమాసి కంలో టీసీఎస్ ఆదాయం 7.06 శాతం పెరి గి రూ.60,698 కోట్ల నుంచి 64,988 కోట్ల కు చేరింది. గురువారం సమావేశమైన కంపె నీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.10 చొప్పున డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. అక్టోబర్ 18 రికార్డుతేదీగా నిర్ణయించింది. కొత్తగా 5,726 మందిని నియమించుకోవడంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6,12,724కు చేరింది.