02-02-2026 01:11:42 AM
టీడీపీ ఖమ్మం జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): పురాణ ఇతిహాసాల పరంగా చూసినా, చరిత్రలు చదివినా ప్రతి ఒక్కరూ గొప్పగా కీర్తించే భారతదేశంలో, స్వతంత్ర పోరాటం ద్వారా ప్రజాస్వామ్య పాలనను తెచ్చుకున్న చోట దిగజారుడు రాజకీయాలు చేస్తూ, అత్యంత హీనమైన భాషను మాట్లాడుతూ వైయస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడిన తీరు హేయనీయమని టిడిపి ఖమ్మం జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పై బూతులు దుర్భాషలాడటం అక్కడున్న వారిని రెచ్చగొట్టడం దానికి స్పందించి అక్కడున్నటువంటి ప్రజలు కార్యకర్తలు దానిని ప్రతిఘటించారు దీనిని అనుకున్న నేపథ్యం పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం లడ్డూలలో కల్తినేయనేది కలపడం అనేది అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికి కారణం అని పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది.
ఆనాటి మాజీ పాలకమండలి సభ్యులు సుబ్బరామిరెడ్డి గారు విచారణకు ఆదేశించడం జరిగింది. ఆ విషయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దీన్ని నిర్ధారించాలని సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అది దర్యాప్తు సంస్థ ఈ విషయంలో అంబటి రాంబాబు బూతులు తిట్టడంపై తెలంగాణ టిడిపి తీవ్రంగా ఖండిస్తుంది. మధిర పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు రాజకీయ భాష చాలా హుందాగా ఉండేదని, కానీ ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ అడుగు పెట్టాక మాట్లాడే భాషకు బూతు వ్యాకరణాన్ని కనిపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు నాయుడు పాలించాడని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండో విడత గెలిచారని గుర్తు చేశారు.
అలాంటి బాధ్యత గల సీనియర్ నాయకుడి పట్ల ఇష్టా రాజ్యాంగం మాట్లాడాడు తగదని అన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న అంబటి రాంబాబు గుర్తుంచుకోవాలని హితువు చెప్పారు. ప్రతి మనిషికి ఒక హద్దు ఉంటుందని, ఇష్ట రాజ్యాంగ ఎదుటి వాళ్ళని దూషిస్తే శిశుపాలుడు పాపాలు లెక్క కట్టినట్టు లెక్కగట్టి రాజకీయ సమాధి చేస్తారని హెచ్చరించారు. మానసికంగా ఒక వ్యక్తిని బాధించడం కూడా నేరమే అవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. దుర్మార్గపు మాటలతో ముందుకు వెళితే క్షమించరని హెచ్చరించారు.
చంద్రబాబు నాయుడు తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని అన్నారు. దానిని బలహీనతగా భావించి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తే బుద్ధి చెప్పేందుకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలకాలని, అటు ఆంధ్రప్రదేశ్లోనూ, ఇక తెలంగాణలోనూ మంచి రాజకీయ వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు శేఖర్ బాబు, మండల అధ్యక్షులు మార్నీడి పుల్లారావు,టౌన్ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, మేడ వెంకటేశ్వరరావు, ములకలపల్లి వినయ్, గడ్డం రమేష్, చెరుకూరి కృష్ణారావు, పాల్గొన్నారు.