34 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి
ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్చడం లేదు
విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 34 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణ య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ ముది రాజ్, బి. నరహరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీచర్ పోస్టులు భర్తీ కాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోందని ఆయన అన్నారు. సుమారు14 వేల పాఠశాలల్లో ఇంగ్లిష్, మ్యా థ్స్, సైన్స్ బోధించే ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపారు. దీంతో విద్యార్థులు ప్రాథమిక విషయ పరిజ్ఞానంలో వెనుకబడుతు న్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 14 వేలకు పైగా, ఎయిడెడ్ పాఠశాలల్లో 5,900, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 9వేలు, ఆదర్శ పాఠశాలల్లో 3వేలు, కస్తూర్బా పాఠశాలల్లో 1,500 వరకు పోస్టు లు ఖాళీగా ఉన్నాయన్నారు. గెస్ట్, పార్ట్‌టైమ్ టీచర్లతో నెట్టుకొస్తున్న పరిస్థితిని మార్చి పూ ర్తిస్థాయి ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జంట నగరా ల బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బి నరహరిని నియమించారు. సమావేశం లో బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి అనంతయ్య, బీసీ సంఘం నాయకులు సి. రాజేందర్, భూపేష్ సాగర్, బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.






