10 March, 2026 | 2:37 AM

భారత దేశ చరిత్రలో స్త్రీకి ప్రత్యేకమైన స్థానం

10-03-2026 01:08 AM

నిజామాబాద్, మార్చి 9 (విజయ క్రాంతి): భారత దేశ చరిత్రలో మహిళకు ప్రత్యేక స్థానం ఉందని న్యాయవాద పరిషత్ అధ్యక్షులు ఎం జగన్ మోహన్ గౌడ్ అన్నారు. సోమవారం రోజు నగరం లోని స్థానిక ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ నాగరికతలో స్త్రీని ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించడం జరిగిందని దేశ స్వతంత్ర ఉద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్య దేవి, లాంటివారు విరోచితం గా పోరాటం చేసి మనందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.

ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని మహిళా అభివృద్ధి చెందితే ఆ ఇల్లు తో పాటు ఆ గ్రామం ఆదేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత సంవత్సరం దేశంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇద్దరు మహిళల అధికారులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టి కరూపించి భారత మహిళా శక్తిని చాటారు అని తెలిపారు

కాబట్టి విద్యార్థినిలు అందరు కూడా చరిత్ర ఆధారంగా నడవాలని దేశ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టాలని ప్రశత్య సంస్కృతి పోకడలను వీడనాడాలని భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించనున్నారు. ముందుగా విజ్ఞానంలో ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  న్యాయవాది పిల్లి శ్రీకాంత్, సింగం అంజలి కళాశాల కరస్పాండెంట్ దేవా రెడ్డి ప్రిన్సిపాల్ స్వప్న తోపాటు అధ్యాపకులు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.