19 May, 2026 | 2:02 AM

ఆగష్టులో శ్రీలంకకు టీమిండియా

19-05-2026 12:58 AM

ముంబై, మే 18: ప్రపంచ టెస్టు ఛాంపియనిప్‌లో భాగంగా భారత జట్టు ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆగస్టు రెండో వారం నుంచి ఇరుజట్లు తలపడుతాయని సమాచారం. ఇప్పటివరకూ శ్రీలంక క్రికెట్ షెడ్యూల్‌ను ప్రకటించలేదు. అయితే రెండు వారాల్లో సిరీస్ నిర్వహించాలని లంక భావిస్తోంది. ఆగస్టు 15 నుంచి 27 మధ్య మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ, శ్రీలంక క్రికె ట్ వెల్లడించాయి.

లంక ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే భారత్, లంక సిరీస్ జగనుంది. టెస్ట్ సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ పైనా క్లారిటీ రావాల్సి ఉంది. అవినీతి ఆరోపణలతో లంక బోర్డును ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే రద్దు చేశారు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ బాధ్యతలు చూసుకుంటోంది. దాంతో.. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈమధ్యే ఐసీసీ ప్రతినిధిగా లంకకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించాడు. ఈ క్రమంలోనే నిరుడు దిత్వా తుఫాన్ బాధితుల కోసం నిధుల సమీకరణకు మూడు టీ20ల సిరీస్ నిర్వహించాలని ప్రతిపాదన వచ్చింది.