4 May, 2026 | 2:49 AM

బోధనలో సాంకేతికత ను వినియోగించుకోవాలి

12-03-2026 05:14 PM

డీ ఈ వో. రాజు

సదాశివనగర్, మార్చ్ 12(విజయక్రాంతి): మారుతున్న మార్పులకు అనుగుణంగా విద్యాబోధనలో  సాంకేతికత ను వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు అన్నారు. సదాశివనగర్ మోడల్ స్కూల్ లో రెండు రోజులపాటు ఏ ఎక్స్ ఎల్ లాబ్  ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులకుజరిగిన శిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో 23 పాఠశాల లలో.AXL LAB లు ఉన్నాయని సమీప హై స్కూల్.ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని రెగ్యులర్ గా తరగతులు నిర్వహించాలని ఆయన కోరారు.

త్వరలో ప్రాథమిక.పాఠశాల లకు కూడా ఇంటర్ నెట్ వచ్చే విధంగా ప్రతిపాదన పంపుతామని ఆయన అన్నారు. వెనుకబడిన విద్యార్థులకు AXL లాబ్ ద్వారా భాష, గణితం లలో ప్రావీణ్యం కల్పించ వచ్చునని ఉపాధ్యాయులు ఈ విషయంలో అంకిత భావంతో కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30,31 తేదీలలో NCERT ఆధ్వర్యంలో  జరిగే  FLS కోసం విద్యార్థులను.పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో అకాడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, కమ్యూనిటీ. మొబిలైసేషన్ అధికారి నాగవేందర్, స్థానిక మండల విద్యాశాఖాధికారి యోసెఫ్ , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజిరెడ్డి రిసోర్స్ పర్సన్స్ అఖిల్ వెంకటేష్ సాయి ప్రసాద్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.