సీహెచ్సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన తహశీల్దార్
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(సిహెచ్సీ) తహశీల్దార్ ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం రక్త పరీక్షల కేంద్రానికి వెళ్లి రికార్డులు పరిశీలించారు.ఆసుపత్రిలో వైద్య సేవల గురించి సూపర్దేంట్ డాక్టర్ ఎం. ముక్కెంటేశ్వరావు ను అడిగి తెలుసుకొన్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు గురించి ఆరా తీశారు.
అనంతరం ఆసుపత్రిలో హెచ్ పి వి వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.డాక్టర్ అమరేందర్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కృష్ణసాగర్ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న వసతులను పరిశీలించి,విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణ సాగర్ ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు, రెవెన్యూ,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు




