29 March, 2026 | 3:24 AM

ఆటల పోటీల్లో తీన్మార్ మల్లన్న

29-03-2026 01:40 AM

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో శనివారం నిర్వ హించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉత్సాహంగా పాల్గొన్నారు. తోటి ప్రజా ప్రతిని ధులతో కలిసి ఫుట్‌బాల్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ క్రీడల్లో చురుకుగా ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు.

సభల్లో ఎప్పుడూ తనదైన ఫైరింగ్ స్టెల్‌తో మాట్లాడే మల్లన్న, ఈసారి గ్రౌండ్‌లో సరదాగా ఆటల్లో పాల్గొంటూ కనిపించడం అభిమానుల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. క్రీడా స్ఫూర్తిని ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి నవ్వులు పూయిస్తూ ఆడిన మల్లన్నను చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన అభిమానులు మల్లన్నకు ఘన స్వాగతం పలికి, ఆయనతో కలిసి ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు.