29 March, 2026 | 3:22 AM

బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్

29-03-2026 01:36 AM

బీసీ ఉద్యోగుల కోసం ప్రారంభించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): తెలంగాణలోని బీసీ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం, వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా ఒక అభయ కవచంలా ఉండేందుకు ’బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్’ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేశారు. కార్యాలయాల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వివక్షను ఇకపై సహించబోమని, ఎందాకైన కోట్లాడుతాం అని తెలిపారు. పదోన్నతుల్లో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని విమర్శిం చారు.

అగ్రవర్ణ అధికారుల టార్గెటింగ్, కులం పేరుతో కించపరచడం, చిన్న కారణాలకే ఛార్జ్ మెమోలు ఇవ్వడం, అన్యాయంగా సస్పెండ్ చేయడం, పదే పదే బదిలీలు చేయడం కక్ష సాధింపు చర్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిని ఎదుర్కునేందుకే బీసీ ఉద్యోగుల రక్షణ కవచంగా బీసీ ఎంప్లాయిస్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. బీసీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఈ సెల్ నాలుగు మార్గాల్లో పని చేస్తుందన్నారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్, వాట్సాప్ సదుపాయం ద్వారా క్షణాల్లో స్పందన ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీల ద్వారా క్షేత్ర స్థాయిలో తక్షణ పరిష్కారం, పార్టీ తరఫున అనుభవజ్ఞులైన లాయర్లతో డిపార్ట్మెంటల్ ఎంక్వయి రీలు, కోర్టు కేసుల్లో ఉచిత న్యాయ సహా యం చేస్తామని వెల్లడించారు.

సాక్ష్యాధారాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), మంత్రులకు ఫిర్యాదులు చేస్తూ రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. ఉద్యోగానికి ఎటువంటి ముప్పు లేకుండా ఫిర్యాదు చేసిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. 9866524314 నంబర్‌కి మెసేజ్ లేదా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.