19-02-2026 12:00:00 AM
నిజాంసాగర్ ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని నిజాంసాగర్ తహసిల్దార్ భుజంగరావు బుధవారం తనిఖీ చేశారు. ఏలాంటి అవకతవగలకు తావు లేకుండా ప్రజలకు సరుకులను అందించాలని ఆయన రేషన్ డీలర్ను ఆదేశించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎన్ఫోర్స్మెంట్ డిటి మహమ్మద్ ఖలీల్, ఆర్ ఐ సాయిలు, జిపిఓ సంగమేశ్వర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సంకు లక్ష్మయ్య, ఉప సర్పంచ్ రవీందర్, నాయకులు మంద బలరాం రేషన్ డీలర్ మహమ్మద్ తాయ్యుబ్ తదితరులు ఉన్నారు.