calender_icon.png 22 December, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీ ముఖ్య నేతలతో తహసీల్దార్ సమావేశం

09-10-2024 05:28:25 PM

కొడంగల్ (విజయక్రాంతి): రాబోయే ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని తహసీల్దార్ విజయ్ కుమార్ అన్నారు. వివిధ పార్టీల రాజకీయ  నేతలతో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు సజావుగా నిర్వహించెదుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే తెలపాలని అన్నారు. 18సం, నిండిన ప్రతి ఒక్కరు ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఓటరు సర్వే చేసినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.