30 June, 2026 | 11:42 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

త్వరలో సొంత భవనాల్లోకే తహసీల్దార్ కార్యాలయం

21-03-2026 12:02 AM

రేవల్లిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

రేవల్లి మార్చ్ 20: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రేవల్లి మండలంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం ఆయన ఆయా మండలాల్లో పర్యటిం చి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న భవనాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవనాల నిర్మాణ నాణ్యతను సమీక్షించి, పెండింగ్లో ఉన్న ఫర్నిచర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయాలను వెంటనే నూతన భవనాల్లోకి మార్చి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అ న్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకురావాలని తహసీల్దార్లకు సూచించారు. కలె క్టర్ వెంట తహసీల్దార్ సరస్వతి తదితరులు ఉన్నారు.