రంజాన్ కానుకలు పంపిణీ
21-03-2026 12:00 AM
రాజాపూర్ మార్చి 20: మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు చించోడు అభిమానులు రెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం మైనార్టీలకు రంజాన్ కిట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, మాజీ కో అప్షన్ సభ్యుడు తహర్ పాషా,నర్సిములు, కృష్ణ, చంద్రయ్య, రహమాత్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.




