7 August, 2026 | 11:53 AM

ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 10న 'వరుణయాగం'.. ఎక్కడంటే?

07-08-2026 11:16 AM

హైదరాబాద్: తెలంగాణ ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు(Rains) కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్‌నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేకుండా ఉండాలని, ఆకాంక్షతో వరుణ యాగం( Varuna Yagam) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సీఎం సూచనల మేరకుయాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Lord Narasimha Devasthanam - Yadagirigutta) అర్చక, సిద్ధాంతులు  ఆగస్టు 10 వ తేదీన వరుణయగానికి మూహూర్తం ఫిక్స్ చేశారు. యాదగిరిగుట్ట దేవస్థాన ఆధ్వర్యంలో  108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు, అర్చక బృందం సమక్షంలో మహా వరుణయాగం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర మహాయాగం కృష్ణానది తీరాన వెలసిన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున, విజయవిహార్  ఆవరణలో నిర్వహించబడుతుంది. ఈ మహాయాగంలో సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొననున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఈనెల 10న వరుణయాగం చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాల మేరకు వరుణ యాగం నిర్వహిస్తున్నారు. వరుణయాగానికి యాదగిరిగుట్ట అర్చకులు, వేద పండితులు ముహూర్తం ఖరారు చేశారు. నాగార్జున సాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగం చేయనున్నారు. కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో పాడి పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో వరుణయాగం చేస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) సారథ్యంలో ఈ వరుణ యాగం నిర్వహించబడుతుంది. సాయంత్రం జరిగే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.