ట్యాంక్‌బండ్ వద్ద ఏం జరగనుంది?
హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. సోమవారం ఉదయం 10:30 గంటలకు ట్యాంక్‌బండ్-లిబర్టీ(Tank Bund - Liberty) వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభం కానుంది. అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్(Telangana Congress protest) నేతలు తెలిపారు. అనంతరం ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ఉంటుందని మహిళా కాంగ్రెస్ నాయకత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి: శ్రీశైలంలో సీన్ మారింది
ఎవరు పాల్గొంటారు?
ఈ ఆందోళనలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) నాయకత్వం వహించనున్నారు. హైదరాబాద్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళా కాంగ్రెస్ నాయకులు, జిల్లా స్థాయి పదాధికారులు, డివిజన్ స్థాయి మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నాయి.
తెలంగాణలో నేడు పొలిటికల్ హీట్!
SIR ప్రక్రియపై(Congress SIR protest) కాంగ్రెస్-ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్న వాదనల నేపథ్యంలో నేటి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పారదర్శకత కోరుతున్న కాంగ్రెస్.. మరోవైపు ఎన్నికల సంఘం తన నిర్ణయ ప్రక్రియపై వివరణ ఇచ్చింది. దీంతో ట్యాంక్‌బండ్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు జరగనున్న ర్యాలీపై ఆసక్తి నెలకొంది.