30 June, 2026 | 9:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అల్ఫోర్స్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

03-06-2025 01:08 AM

కొత్తపల్లి, జూన్ 2 (విజయక్రాంతి): ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల్లో చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి జాతీయ ప్రధాన ఎగరవేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తున్నదని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

ఎంతోమంది త్యాగదనుల ఫలితమే నేటి తెలంగాణ అని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుండడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.