30 June, 2026 | 10:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

సీఎంతో చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తాం

03-06-2025 01:09 AM

ఆర్టీసీ కార్మిక నాయకులతో పీసీసీ చీఫ్ హామీ

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్టు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి కే రాజి రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షున్ని కలిసి తమ దీర్ఘకాలిక సమస్యలపై వివరించామని చెప్పారు.

సానుకూలంగా స్పందించిన పీసీసీ చీఫ్ వెంటనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కార్మికుల సమస్యలపై ఫోన్‌లో మాట్లాడినట్టు వెల్లడించారు. త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘానికి సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ ఇప్పించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్‌డబ్ల్యూయూ నేతలు అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అజిత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.