3 June, 2026 | 2:40 AM

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

03-06-2026 01:54 AM

తాడ్వాయి, జూన్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో తహాసిల్దార్ శ్వేత, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఇన్చార్జి ఎంపిడిఓ సవితారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో అధ్యక్షులు ముదాం నరసింహులు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో అధ్యక్షులు బండారి సంజీవులు, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ కపిల్ రెడ్డి, మండలంలోని గ్రామ పంచాయతీల ఆవరణలో సర్పంచులు జెండాలను ఆవిష్కరించి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర అవతరణతో తెలంగాణ ఎంతో అభివృద్ధి దశలో ముందుకు వెళుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలబడాలని నాయకులు పిలుపునిచ్చారు.