3 June, 2026 | 2:40 AM

2028లో మాకు ప్రత్యర్థులే ఉండరు

03-06-2026 01:54 AM
  1. మళ్లీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
  2. బావుల వద్ద మీటర్లు పెట్టం.. ఉచిత కరెంటే ఇస్తాం
  3. కేంద్రంలోని బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం 
  4. ధాన్యం కొనుగోళ్లపై బండి, కిషన్ వైఖరి ఏమిటి?
  5. ఓట్ల గల్లంతుపై మీడియా దృష్టి పెట్టాలి
  6. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  7. ఖమ్మంలో ఆవిర్భావ వేడుకలకు హాజరు

ఖమ్మం, జూన్ 2 (విజయక్రాంతి): 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యర్థులే ఉండరని, మళ్లీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవా రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు.

2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎవ్వరు ప్రత్యర్థులు ఉండరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. ప్రజా ప్రభుత్వం.. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు అశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్య ర్థులకు డిపాజిట్లు కూడా రావని, 100 సీ ట్లకు పైగా గెలుస్తామని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సర్‌తో ఓట్లు గల్లంతు అయ్యే అవకాశం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఓట్ల గల్లంతుపై మీడి యా దృష్టి పెట్టాలని, ప్రతి ఒక్కరు మ్యాపిం గ్ అన్ మ్యాపింగ్‌పై దృష్టి పెట్టాలని కో రారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో సమస్యలు వచ్చాయని అందుకే పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి కూడా సమీక్ష చేస్తున్నామని అన్నారు. రాష్ర్టంలో ప్రస్తుత మంత్రి వర్గం అద్భుతం గా పనిచేస్తున్నదని, తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రులు పని చేస్తున్నారని భట్టి విక్రమార్క కొనియాడారు. 

మీటర్లు పెట్టం

బావుల వద్ద మీటర్లు పెట్టే పరిస్థితి లేదని, రైతులకు ఉచిత కరెంట్ మాత్రమే ఇస్తామని భట్టి విక్రమార్క అన్నారు. సీఎం ప్రకటనపై ప్రత్యర్థులు ఎవ్వరు మాట్లాడకపోవడమే భ విష్యత్‌లో తమ విజయానికి తార్కాణమని అన్నారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అందరికీ ప్రయోజనం ఉంటుందన్నారు. బండి, కిషన్‌రెడ్డిలు ముందుగా కొనుగోలు చేసిన ధాన్యం గురించి మాట్లాడాలని, ధా న్యం ఎందుకు కొనడం లేదో చెప్పాలని డి మాండ్ చేశారు.

ధాన్యం కొనుగోళ్లు చేస్తారా, చేయరా? రైతుల పక్షమా? రాజకీయ పక్ష మా? బండి సంజయ్, కిషన్‌రెడ్డి చెప్పాలన్నారు. ముందు ధాన్యం కొని, ఆ తరువాత మాట్లాడాలని సూచించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. గోదాములలో నిల్వ చేయడం నేరమైందని, బీజేపీ అదానీ, అంబానీలకు గోదాములు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్న దేశంగా మా ర్చిందన్నారు.

జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నా రు. జర్నలిస్ట్‌లకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఆరోగ్యశ్రీ అద్భుతంగా ఉంద ని, దానిని ఉపయోగించుకోవాలన్నారు.