2 June, 2026 | 5:09 PM

విశ్వవిద్యాలయ అభివృద్దే మా ద్యేయం: ఆచార్య ఉమేశ్

02-06-2026 04:06 PM

ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ జాతీయ పతాకం ఎగరవేసి మాట్లాడుతూ... విశ్వవిద్యాలయంలో అన్ని రకాల మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని ఆధునిక పద్ధతులలో డిజిటల్, ఈ- క్లాస్ రూములతో విద్యాబోధన జరుగుతోందని, ఈ కొత్త విద్యా సంవత్సరంలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కళాశాలలో రెండేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని దానిలో భాగంగా ఈ విద్యా సంవత్సరం మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుకి దరఖాస్తు చేసామని మనకున్న సౌకర్యాలకు కోర్స్ నిర్వహించడానికి అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.