2 June, 2026 | 5:18 PM

ఎల్లారెడ్డిలో ఎగిరిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జెండా

02-06-2026 04:13 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం, 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం, మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్యులు, సిబ్బంది ఎల్లారెడ్డి డివిజన్ ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. నర్సింగ్ చౌహన్, ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి (Dy. DM&HO), ఎల్లారెడ్డి డివిజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా, ఒక వైద్యాధికారి, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.