2 June, 2026 | 10:21 AM

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

02-06-2026 09:31 AM

కేసముద్రం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఆవిర్భావం కోసం ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ గంట సంజీవరెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వివేక్, మండల పరిషత్ లో ఎంపీడీవో క్రాంతి, మున్సిపాలిటీలో చైర్ పర్సన్ బానోత్ సునీత, పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ క్రాంతి కిరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.