హైడ్రా పేరు.. పెద్దలతో ప్రభుత్వ ఒప్పందం
బాన్సువాడలో జరిగిన ఘటన దురదృష్టకరం
అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది
హైదరాబాద్: బాన్సువాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. దేశంలో పీఎం ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లు నిర్మించామని బండి సంజయ్ పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా(Hydra) పేరుతో పెద్దలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటోందని ఆరోపించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.
పేద విద్యార్థుల(Poor students) పరిస్థితి ఎందని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎంకు హిందూ పేదోళ్ళ చదువులు ముఖ్యం కాదన్న బండి సంజయ్ పేదోళ్ళ ఇంజినీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు, ఐపీఎస్ లు కావద్దని, ఫాతిమా కాలేజీలో చేదుకున్న వాళ్లు మాత్రమే డాక్టర్లు, ఇంజినీర్లు, గొప్పవాళ్లు కావాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు. బఫర్ జోన్ లో ఎన్ని నివాసాలు ఉన్నాయి. ఇళ్ల కూల్చివేతలపై చర్చకు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్ విసిరారు.




